Skip to main content

Supplementary Exams: రేపటి నుంచి బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు..

Supplementary Exams

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు బీపీఈడీ, ఎంపీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కం ట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 

వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ ఆదేశాల మేరకు నిర్వ హిస్తున్న ఈ పరీక్షలకు 235 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

 Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్ మేళా

బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు..

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు బీఈడీ స్పెషల్ సప్టిమెంటరీ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఈ పరీక్షలకు 46 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Published date : 27 Aug 2024 04:48PM

Photo Stories