వరదలతో డిగ్రీ పరీక్షలు వాయిదా

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు ఒకటి నుంచి జరుగవలసిన డిగ్రీ నాలుగవ సెమిస్టర్‌ పరీక్షలను వరదల కారణంగా ఆగస్టు 8తేదీకి వాయిదా వేశామని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఎస్‌.లింగారెడ్డి తెలిపారు.
వరదలతో డిగ్రీ పరీక్షలు వాయిదా

ఈ మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు పంపించామన్నారు.

కాలువలో పడి వ్యక్తి మృతి

మలికిపురం: మండలంలోని గుడిమెళ్లంక గ్రామం మూలపోడుకు చెందిన గొల్లశేఖర్‌(59) ప్రమాదవశాత్తూ పంటకాలువలో పడి మృతిచెందారు. ప్రతి రోజూ సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం వంతెన వద్ద స్నేహితులతో కలిసి కూర్చొని వచ్చే శేఖర్‌ ఆదివారం రాత్రి కూడా అక్కడికి వెళ్లారు. శేఖర్‌ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఉదయం కాలువలో మృతదేహం లభ్యమైంది. చీకటి పడిన తరువాత కాలువలో దిగి కాళ్లు కడుక్కునే ప్రయత్నంలో పడిపోయారని, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో గమనించలేదని భావిస్తున్నారు. పోలీసులు పోస్ట్‌మార్టంకు రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

#Tags