Medical Health Department: పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ టౌన్‌: 2023–24 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని పారామెడికల్‌ ప్రైవేట్‌ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అనిమళ్ల కొండల్‌రావు అక్టోబ‌ర్ 26న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

డీఎంపీహెచ్‌ఏ(ఎం), డీఎంఎల్‌టీ, డీఓఏ, డీఏఎన్‌ఎస్‌, డీఎంఐటీ, డీఆర్‌జీఏ, డీఓఎం, డీఈసీజీ, డయాలసిస్‌, టీసీఎల్‌టీ, డీఏఎం కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. అక్టోబ‌ర్ 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.

చదవండి:

KNRUHS: బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

High Court: మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?

#Tags