Mega Job Mela: పాడేరులో మెగా జాబ్‌మేళా.. తేదీ ఇదే..

పాడేరు రూరల్‌ : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిసెంబ‌ర్ 15న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్‌ తెలిపారు.

డిసెంబ‌ర్ 13న‌ ఆయన తన క్యాంపు కార్యాలయంలో జాబ్‌మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం పీవో మాట్లాడుతూ ఈ మెగా జాబ్‌మేళాలో లైఫ్‌ సర్కిల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీఎంఆర్‌ రక్షా సెక్యూరిటీ, అపోలో ఫార్మసి, కేర్‌ ఫర్‌ యూ, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, మోహన్‌ స్పిన్టెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పైఎస్‌కే ఇన్ఫోటెక్‌, ఈకాం ఎక్స్‌ప్రెస్‌, నవతా రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్స్‌ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.

చదవండి: Bajaj Finserv, AICTE & NSDC: గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ

ఎంపికై న వారికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వేతనం చెల్లిస్తారన్నారు. టెన్త్‌ నుంచి పీజీ వరకు, ఐటీఐ నుంచి డిప్లామో, ఇంజనీరింగ్‌ చదువుకున్న యువతీ యువకులు ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని పీవో కోరారు. వివరాలకు 0401786463, 9308338105 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డీఎస్‌డీవో జి. ప్రశాంత్‌, ప్రతినిధి నవీన్‌ పాల్గొన్నారు.

#Tags