Nursing Jobs: బీఎస్సీ నర్సింగ్‌తో జర్మనీలో కొలువులు

నరసరావుపేట ఈస్ట్‌: బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జర్మనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సంజీవరావు తెలిపారు.
బీఎస్సీ నర్సింగ్‌తో జర్మనీలో కొలువులు

ఇందులో భాగంగా టాక్ట్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ)తో కలిసి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు పొందేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. అభ్యర్థి నర్సింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, రెండేళ్ల పని అనుభవం ఉండాలని, జర్మనీలో పనిచేసేందుకు సిద్ధపడాలని తెలిపారు.

విజయవాడలోని కేఎల్‌ వర్సిటీలో బీ1 స్థాయి జర్మన్‌ భాష శిక్షణ కోసం అందించే ఉచిత శిక్షణకు హాజరు కావాలన్నారు. 2 నెలల పాటు రోజుకు 6 గంటలు చొప్పున వారానికి 48 గంటలు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో హాస్టల్‌లో ఉండే అభ్యర్థులు హాస్టల్‌ ఫీజులను వారే చెల్లించుకోవాలని చె­ప్పా­రు. బీ1 స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన తరువాత ఆఫర్‌ లెటర్‌ అందజేస్తారన్నారు.

చదవండి: 1,827 Jobs: భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

అభ్యర్థి తన బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, అనుభవ ధ్రువీకరణ పత్రం తప్ప­నిసరిగా కలిగి ఉండాలన్నారు. ఆఫర్‌ లెటర్‌ పొందిన అభ్యర్థులకు విమాన చార్జీలు ఉచితమని అలాగే మొదటి 6 నెలలు ఆహారం, వసతి కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు. ఈ సమయంలో నెలకు 1,000 యూరోలు (రూ.89వేలు) జీతమివ్వనున్నట్లు చెప్పారు.

చదవండి: Central Government: స్టాఫ్‌ నర్స్‌.. ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌

జర్మనీలో 6 నెలలు బీ2 సర్టిఫికేషన్‌ శిక్షణ ఇస్తారని, బీ2 స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన తరువాత నెలకు 2,500 యూరోలు జీతంగా చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని, నైపుణ్యాభివృద్ధి సంస్థ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9988853335 సంప్రదించాలని సూచించారు. 

#Tags