Medical and Health Department: స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (సీఏఎస్‌ఎస్‌) పోస్టుల భర్తీకి నేటి నుంచి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

రోజు విడిచి రోజు జూలై 10 వరకు వీటిని నిర్వహిస్తారు. మొత్తం 14 స్పెషాలిటీల్లో 331 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో భాగంగా తొలి రోజు జూలై 5న జనరల్‌ మెడిసిన్‌–73, జనరల్‌ సర్జరీ–31, డెర్మటాలజీ–08, మైక్రోబయాలజీ–01, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌–05 విభాగాల్లో 118 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేపడతారు.

చదవండి: 331 Jobs: వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

శాశ్వత, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఉంటుంది. కాంట్రాక్ట్‌ నియామకాల్లో విశ్రాంత వైద్యులకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్వ్యూల్లో పాల్గొనే అభ్యర్థులు ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని ఏపీవీవీపీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యా­హ్నం ఒక గంట మధ్య దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం 6301138782, apvvpwalkinrecruitment@gmail.comను సంప్రదించవచ్చు.   

చదవండి: NMC: వైద్య విద్యార్థుల‌కు కీల‌క అప్డేట్‌... ఈ ఎగ్జామ్ పూర్తి చేసిన‌వారికే లైసెన్స్‌

#Tags