Knox Cyber Security Courses: నాక్స్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ (నాక్స్‌) ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్న సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌ ఇన్‌ సైబర్‌ లా కోర్సుల్లో ఆన్‌లైన్‌లో శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ విమలారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 15 వరకు గడువు అని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్హత గల అభ్యర్థులు అర్హులని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

చదవండి: New Zealand Parliament: న్యూజిలాండ్ పార్లమెంట్ హ్యాకింగ్.. చైనాపై ఆరోపణలు

శిక్షణ ఫీజులో కూడా 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం కేంద్రప్రభుత్వ గుర్తింపుతో కూడిన సర్టిఫికెట్లను ప్రదానం చేస్తామని తెలిపారు.  ఆన్‌లైన్‌లో  www.nacsindia.org వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని, వివరాలకు 7893141797 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.    

#Tags