మానసిక సమస్యల కౌన్సిలింగ్ కి కు టెలి మానస్ టోల్ ఫ్రీ నంబర్

ఏలూరు, మే, 4 : ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుందన్న విషయం గుర్తిస్తే బలవన్మరణాలను నిరోధించవచ్చని, మానసిక సమస్యలపై కౌన్సిలింగ్ కి 14416 కాల్ చేస్తే మానసిక స్థైర్యం పొందవచ్చని ఎన్సీడీ ప్రాజెక్ట్ అధికారి మరియు ఆర్బీఎస్కె జిల్లా కోఆర్డినేటర్ డా. మానస చెప్పారు.
మానసిక సమస్యల కౌన్సిలింగ్ కి కు టెలి మానస్ టోల్ ఫ్రీ నంబర్

ఆత్మహత్యలపై వార్తా కధనాలు- ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు,ఆత్మహత్యలు నిరోధించడంలో మీడియా పాత్ర అంశాలపై బెంగుళూరు 'నిమ్ హాన్స్' యూనివర్సిటీ కి చెందిన సైకాలజీ మరియు సోషల్ వర్క్ విభాగం ప్రొఫెస్సొర్స్ అనీష్ చెరియన్, ఆర్య తిరుమేని తో కలిసి ప్రముఖ దినపత్రికలు, చానెల్స్ కు చెందిన ప్రతినిధులతో గురువారం బెంగుళూరు నుండి  జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. మానస మాట్లాడుతూ ప్రతీ సమస్యకు పరిష్కారముంటుందని,  ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడే వారి సమస్యకు పరిష్కారాలున్నాయని , మరణమే శరణ్యం కాదని విశదీకరిస్తే బలవన్మరణాలను నిరోధించడానికి వీలవుతుందన్నారు.  ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 14416 టోల్ ఫ్రీ నెంబర్ తో టెలి మానస్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఎవరైనా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడేవారు  14416 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి తమ సమస్యలను తెలియజేస్తే మానసిక వైద్య నిపుణులు సదరు సమస్యకు సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారన్నారు.  ఏలూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మానసిక సమస్యలు-ఆత్మహత్యల నిరోధంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.  ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, తీవ్ర భయాందోళనలు, మాదకద్రవ్య దుర్వినియోగం, ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలతో ఉన్న వారు ఎవరైనా ఈ టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించడం ద్వారా విలువైన సలహాలు సూచనలు పొందవచ్చన్నారు. టెలి మానస్ 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు మీడియా మరింత ప్రాచుర్యాన్ని ఇచ్చి బలవన్మరణాలు నిరోధానికి తమ వంతు పాత్ర పోషించాలని మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

బెంగుళూరు 'నిమ్ హాన్స్' యూనివర్సిటీ కి చెందిన సైకాలజీ మరియు సోషల్ వర్క్ విభాగం ప్రొఫెస్సొర్స్ అనీష్ చెరియన్, ఆర్య తిరుమేని లు తమ చర్చ లలో మాట్లాడుతూ  ఆత్మహత్యల వార్తాంశాలను ప్రముఖంగా ప్రచురించవద్దని, దీనివల్ల అప్పటికే మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నవారు  ఆత్మహత్య ఒక పరిష్కారంలా  భావించి  తద్వారా ఇది మరిన్ని మరణాలకు దారి తీస్తుందన్నారు. అదే సమయంలో ఆత్మహత్యలకు సంబంధించి వార్తా కధనాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా రూపొందించిన నిబంధనలకు లోబడి ప్రచురించేలా చూడాలన్నారు.  ఆత్మహత్యలపై  వివరణాత్మక కధనాలలో సంఘటనకు గల కారణాలు, వివిధ వ్యక్తుల ఇంటర్వ్యూ లు, నిర్ధారణ కానీ అంశాలు, తదితర సమాచారాన్ని ప్రజలకు తెలియజేసే సమయంలో వాటిలో సమాజంపై చేడు ప్రభావం జరిగే అవకాశం ఉన్నాదని భావిస్తే  కధానాలలో అటువంటి అంశాలను తొలగించేలా మీడియా వారు ప్రయత్నించాలన్నారు.

#Tags