Technical Certificate Course: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు తేదీలు ఇవే..

నిర్మల్‌ రూరల్‌: టైలరింగ్‌, డ్రాయింగ్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ పరీక్షలు జనవరి 11 నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో పి.రామారావు తెలిపారు.

టైలరింగ్‌ అండ్‌ ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్‌ లోయర్‌, హయ్యర్‌ పరీక్షలు డిసెంబ‌ర్ 11 నుంచి 17వ తేదీ వరకు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలలో జరుగుతాయని వివరించారు. డ్రాయింగ్‌ లోయర్‌, హయ్యర్‌ పరీక్షలు 11, 12, 16, 17 తేదీలలో ఉదయం, మధ్యాహ్నం ఉంటాయన్నారు.

చదవండి: Faculty Jobs: ఎయిమ్స్‌ గువాహటిలో 77 ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.1,68,900 జీతం..

టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌ పరీక్షలు డిసెంబ‌ర్ 11వ తేదీన(ఒక రోజు) ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలు నిర్వహిస్తామన్నారు. హయ్యర్‌ పరీక్షలు డిసెంబ‌ర్ 12వ తేదీ ఉదయం, మధ్యాహ్నం, 16వ తేదీ ఉదయం జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags