Justice Anil Kumar Jukanti: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

చిక్కడపల్లి: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని, ఆరోగ్యవంతమైన పోటీ.. సామాజిక అంశాలపై అవగాహన వల్ల సమాజానికి మేలు కలుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి అన్నారు.

న‌వంబ‌ర్‌ 10న సాయంత్రం చిక్కడపల్లిలో పెండేకంటి వెంకట సుబ్బయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన మూట్‌ కోర్టు పోటీల్లో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. న్యాయవాద వృత్తిలో వృద్ధి చెందాలంటే ప్రతిష్టాత్మకమైన న్యాయ శాస్త్ర సాధన అవసరమన్నారు.

చదవండి: Law Course : మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్ర‌వేశంపై ఎన్‌ఎల్‌ఎస్‌ఏ డిమాండ్‌

నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నిముషకవి వాసంతి మాట్లాడుతూ.. విద్యార్థులకు రాజ్యాంగం, న్యాయస్థాన కట్టుబాట్లపై వివరించారు. కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్‌ బి.విజయలక్ష్మి, వాసవి విద్యా సంస్థల జాయింట్‌ సెక్రటరీ ఎం.ఆనంద్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ పి.అరవింద పాల్గొన్నారు.

#Tags