Schools Summer Holidays 2023 : పాఠ‌శాల‌ల వేస‌వి సెలవులు పొడిగింపు.. విద్యాశాఖ ఇచ్చిన‌ క్లారిటీ ఇదే.. ఈ ఏడాది సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ విద్యాశాఖ స్కూల్స్ సెల‌వులు పొడిగింపుపై ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చింది. స్కూల్స్‌ ప్రారంభం తేదీపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 12వ తేదీ (సోమవారం) నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌ కానున్నట్టు జూన్ 9వ తేదీన‌ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
TS Schools Summer Holidays 2023 News

దీంతో జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్‌ తెరుచుకోనున్నాయి. దీంతో విద్యార్థులు పాఠశాలలకు ఖ‌చ్చితంగా హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. తాజాగా సోషల్‌ మీడియాలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్‌ రీఓపెన్‌పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు.

దవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

2023-24 స్కూల్స్ అకాడమిక్ కాలెండర్ ఇదే.. ఈ ఏడాది సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..
తెలంగాణ విద్యాశాఖ మాత్రం అప్పుడే ఈ ఏడాది విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే.. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే.. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించింది. అలాగే సెల‌వుల వివ‌రాలు కూడా ప్ర‌క‌టించింది.

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
➤☛ Summer Holidays Extended 2023 : గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు పొడిగింపు.. కార‌ణం ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే..? అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా..

#Tags