Ganesh Immersion Holiday : గణేష్ నిమర్జనానికి సెలవు.. నవంబర్‌లో ఆ రోజు సెలవు లేదు!
సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవలె, రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నాలుగు సెలవులను మంజూరు చేసింది ప్రభుత్వం. అయితే, ఈనెల 17వ తేదీన జరగనున్న వినాయక నిమర్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవును ప్రకటించి ఉత్తర్వులను జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి వంటి జిల్లాల్లో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అయితే, విద్యార్థులకు ఇందులో ఒక షాకింగ్ వార్తేంటి అంటే.. ఈనెల వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో వచ్చే నెల అంటే.. నవంబర్ 9వ తేదీన రెండో శనివారం. సాధారణంగా ఆరోజు విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. కాని, ఈ వరుస సెలవుల కారణంగా ప్రభుత్వం ఆ రెండో శనివారాన్ని వర్కింగ్ డే గా ప్రకటించింది.
Forest Department jobs news: అటవీ శాఖలో పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
సెప్టెంబర్ 7న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు 17వ తేదీన జరిగే నిమర్జనం వేడుకతో ముగియనుంది. అయితే, 16వ తేదీన కూడా సెలవు ఉండాల్సింది కాని, ప్రభుత్వం దాన్ని రద్దు చేసి 17వ తేదీన జారీ చేసింది. ఇలా, రెండు సెలవులను ఒకే రోజుకు మార్చింది ప్రభుత్వం. ఆరోజు మిలాన్ ఉన్ నబీ పండుగ రోజున నెలవంక దర్శనం కీలకంగా ఉంటుంది. గతేడాది కూడా ఓ తేదీని నిర్ణయించినప్పటికీ… మరో తేదీలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇదే రోజు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కూడా జరగాల్సి ఉంటుంది. కానీ ఇటీవలే ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మిలాద్ కమిటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ర్యాలీ తేదీపై నిర్ణయం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనల తేదీల మార్పుపై నిర్వహించిన సమావేశంలో మిలాద్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నిమర్జనాలు అనంతరం, 19వ తేదీకి తమ ర్యాలీలను వాయిదా వేసుకోవాలనే రేవంత్ రెడ్డి సూచనకు కమిటీ ప్రతినిధులు అంగీకరించారు.
Al Najah 2024: 'అల్ నజా'కు బయలుదేరిన భారత సైన్యం.. దేనికంటే..
ఇదే విషయంపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మిలాద్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్-ఉన్-నబీ ర్యాలీ వేడుకలను 19వ తేదీన నిర్ణయించేందుకు అంగీకరించింది. ఇందుకు అనుగుణంగానే మిలాద్ కమిటీ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది. ఫలితంగా వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వేడుకలు వేర్వురు తేదీల్లో జరగనున్నాయి.
మరిన్ని సెలవులు..
ఈ నెల చివరిలో అంటే.. 28వ తేదీన వస్తున్న నాలుగో శనివారం కూడా పలు స్కూళ్లకు సెలవు ఉంటుంది. మరుసటి రోజున ఆదివారం ఉండడంతో మరో సెలవు ఖాయం. ఇలా, విద్యార్థులకు సెప్టెంబర్ నెల సెలవులతో బాగానే కలిసోచ్చింది. మరి వచ్చే నెల ఎలా ఉంటుందో చూడాలి.
Tags
- school holidays
- Festivals
- ganesh immersion
- four days holidays
- Education Institutions
- ap and telangana schools
- milan un nabi holiday
- november holiday cancel
- september holidays news
- holidays news in telugu
- september holidays news in telugu
- ganesh immersion holiday
- three days holidays for schools
- november holiday cancel news in telugu
- telangana cm revanth reddy
- Milad Un Nabi holiday news in telugu
- Milad Un Nabi Rally
- Milad Un Nabi holiday in telangana
- Milad un Nabi holiday cancel
- Education News
- Sakshi Education News
- Telangana holiday orders
- Vinayaka Nimarjanam 2024
- Consecutive holidays update
- November 9 working day
- School holiday changes
- Educational institutions schedule
- sakshieducationlatest news