Holidays Due to Rain : భారీ వర్ష సూచన.. రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు.. అలాగే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాలయాలకు హాలీడేస్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వానలు భారీగా ప‌డుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ ప్రభుత్వం విద్యాసంస్థ‌ల‌కు శనివారానికి సెలవును పొడిగించింది.
TS Schools and Colleges Holidays

ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో.. శనివారం సెల‌వును పొడిగించారు. సోమ‌వారం నుంచి విద్యాసంస్థ‌లు పునఃప్రారంభం కానున్నాయి. ఒక వేళ సోమ‌వారం కూడా వ‌ర్షాలు ఇలాగే ప‌డితే.. సోమ‌వారం సెల‌వులు ఉండే అవ‌కాశం ఉంటుంది.

➤➤ Schools and Colleges holidays 2023 Extended : భారీ వర్షం.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు.. వివిధ పరీక్షలు వాయిదా.. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా..

హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఈ 3 జిల్లాల ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది.

☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

రేపు విద్యాసంస్థలకు సెలవులు..

వర్షాల దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే గురువారం, శుక్రవారం విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేపు కూడా సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ ​​​​​​​

#Tags