Schools and Colleges holidays 2023 Extended : భారీ వర్షం.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. వివిధ పరీక్షలు వాయిదా.. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా..
వానలు తగ్గకపోతే ఈ సెలవులను కూడా పొడిగించే అవకాశం. వరుసగా నాలుగు రోజులు పాటు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. అలాగే ఈ భారీ వర్షాల కారణంగా.. పలు పరీక్షలను రద్దు చేశారు.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
డిగ్రీ పరీక్షలు వాయిదా..
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలను కూడా రద్దు చేశారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.
ఇంజనీరింగ్ సహా వివిధ రకాల కౌన్సెలింగ్‌ల తేదీలను..
ఇక ఇంజనీరింగ్ సహా వివిధ రకాల కౌన్సెలింగ్‌ల తేదీలను మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇటీవలే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. జూలై 22 నాటికల్లా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. రెండు రోజులుగా వానలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది.దీంతో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని, సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇక గురువారం జరగాల్సిన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది.
ఇంటి బాటపట్టిన విద్యార్థులు..
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. చాలాచోట్ల హాస్టళ్ల చుట్టూ నీరు చేరడం, పలుచోట్ల పైకప్పుల నుంచి నీరు కారడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సెలవులను..
ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నిరకాల విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వైద్యం, పాల సరఫరా వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. ప్రైవేటు సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజుల సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే.. సెలవులను పొడిగించే అవకాశం ఉంది. ఈ ఏడాది తెలంగాణలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఎక్కవగానే ఉన్నాయి.
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌లో పరీక్షలు- సెలవులు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ