డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు రెండే ఉండటంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ పేర్కొన్నారు.
డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి

ప్రభుత్వం స్పందించి మరో రెండు కళాశాలలు ఏర్పాటు చేయాలని ఆగ‌స్టు 10న‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూప్రాన్‌లో డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు ఇంటర్‌ తోనే చదువు ఆపేస్తున్నారని తెలిపారు.

చదవండి: SFI: విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి

సీఎం కేసీఆర్‌ తూప్రాన్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. అలాగే రామాయంపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల లేక సిద్దిపేట, కామారెడ్డికి వెళ్లాల్సి వస్తుందన్నారు. గతంలో కళాశాల ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నవీన్‌ పాల్గొన్నారు.

చదవండి: Education System: విద్యావ్యవస్థ పరిరక్షణకు మరోపోరాటం

#Tags