‘PM Internship’.. నెలకు రూ.6 వేలు.. అప్లై చేసుకోండి ఇలా!

ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు 12 నెలలకు రూ.6 వేలు ఒకేసారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని, ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.
చదవండి: KVPY Fellowships: సైన్స్ విద్యార్థులకు ప్రోత్సాహం.. నెలకు రూ.7 వేల ఫెలోషిప్..
దరఖాస్తు చేసే విద్యార్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలని, వారి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ‘పీఎంఇంటర్న్‌షిప్.ఎంసీఏ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తును పూరించాలని సూచించారు.
అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్ www.internship.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
- విద్యార్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఆసక్తులను బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- ఎంపికైన వారు సంబంధిత శాఖల్లో లేదా ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్ ద్వారా యువతకు ప్రాక్టికల్ పరిజ్ఞానం కలిగి, భవిష్యత్‌కు ఉత్తమ అవకాశాలు లభించేలా ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం!
![]() |
![]() |