Post Matric Stipends: ఉపకారవేతనాల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి
కై లాస్‌నగర్: పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవే ట్ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నూతన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అక్టోబర్ 24న అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీ విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం మూడు దశల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
చదవండి: SBIF Scholarship Program : పేద విద్యార్థులకు ఎస్‌బీఐ ఆర్థిక సాయం.. స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు ఇవే
ఈ మేరకు అవగాహన కల్పించి ప్రతీ విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. పెండింగ్ స్కాలర్‌షిప్ వివరాలను వారం రోజుల్లోగా జిల్లా దళితాభివృద్ధి అధికారికి అందజేయాలని సూచించారు. ఇందులో డీఎస్సీడీవో సునీత, డీఐఈవో రవీందర్, పోస్టల్ మేనేజర్ రాజేశ్‌కుమార్, ఎబీసీడబ్ల్యూవో సునీత, ఎఎస్‌డబ్ల్యూవోలు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#Tags