NTRUHS: ఈ కోర్సులకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్
విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ http://ugparamedical.ntruhsadmissions.comలో దరఖాస్తు పొందవచ్చు. మార్చి 7 నుంచి 21 వరకు దరఖాస్తులు పొంది, పూర్తి చేసిన వాటిని సరి్టఫికెట్ల స్కానింగ్ కాపీలతో 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు అప్‌లోడ్ చేయాల్సి ఉందని రిజి్రస్టార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల డిగ్రీతో పాటు, బ్యాచిలల్ ఫిజియోథెరపీ (బీపీటీ), బీఎస్సీ పారా మెడికల్ కోర్సులకు సంబంధించి మెడికల్ ల్యాబ్, న్యూరో ఫిజియాలజీ, ఆప్తోమెట్రిక్, రెనల్ డయాలసిస్, ఫర్ఫ్యూజన్, కార్డియాక్ కేర్ అండ్ కార్డియో వాసు్క్యలర్, అనస్థీషియాలజీ అండ్ ఆపరేషన్, ఇమేజింగ్, ఎమర్జెన్సీ మెడికల్, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీలలో అడ్మిషన్లు జరపనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
చదవండి: రాష్ట్రంలో స్కిల్ కాలేజీలు, స్కిల్ వర్సిటీలు
పోస్ట్‌బేసిక్ బీఎస్సీ నర్సింగ్
పోస్ట్‌బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) రెండేళ్ల డిగ్రీ కోర్సుకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్ http://ugbsc2ydc.ntruhsadmissions.comలో దరఖాస్తులు పొందవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తులు పొంది, పూర్తి చేసిన వాటిని ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు అప్‌లోడ్ చేయాలని రిజి్రస్టార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు.
చదవండి: NTRUHS: ఎంబీబీఎస్ ప్రవేశాల ఆప్షన్లకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
బీఎన్ వైఎస్‌లో అడ్మిషన్లు
డాక్టర్ ఎనీ్టఆర్ విశ్వవిద్యాలయం 2021–22 విద్యా సంవత్సరానికి బాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సై¯Œ్స (బీఎన్ వైఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ దరఖాస్తులు పొంది, తమ సరి్టఫికెట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేయాలని రిజి్రస్టార్ డాక్టర్ కె.శంకర్ సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని రెండు కళాశాలల్లో కనీ్వనర్ కోటా 100 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.