Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
తిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 8, 2025 జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19వ తేదీ వరకు గడువు పొడిగించారు.
ఆ మేరకు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10వ తరగతి చదివే బాలబాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags