NMC: MBBS 9 ఏళ్లలో పూర్తి చేయాలి.. కాని మొదటి సంవత్సరం ఇన్ని ప్రయత్నాలకు మించి అవకాశమివ్వరు
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సును విద్యార్థులు తొమ్మిదేళ్లలోగా పూర్తి చేయాలని, ఫస్టియర్ను నాలుగు ప్రయత్నాల్లో పూర్తి చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తాజాగా నిబంధనలు తీసుకువచ్చింది.
ఈ మేరకు జూన్ 2న గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023(జీఎంఈఆర్–23) గెజిట్ను విడుదల చేసింది. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ పొందిన తేదీ నుంచి తొమ్మిదేళ్లలోగా ఆ కోర్సును విద్యార్థులు పూర్తి చేయాలి.
చదవండి: AIIMS: ‘నెక్ట్స్’పై నకిలీ సమాచారం నమ్మొద్దు
ఎంబీబీఎస్ కోర్సులో మొదటి సంవత్సరం పూర్తి చేసేందుకు విద్యార్థులకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగుకు మించి ప్రయత్నాలకు అవకాశమివ్వరు. వైద్య సంస్థల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్–యూజీ మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్ ఉండాలి.
#Tags