సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) నిర్వహించాలని నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్త నకిలీదని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) జూన్ 7న ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
‘నెక్ట్స్’పై నకిలీ సమాచారం నమ్మొద్దు
వైద్య విద్యార్థులు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నెక్ట్స్–2023 కల్పిత నోటీసు మీడియాలో ప్రసారమైందని పేర్కొంది. ఈ ఏడాది నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. మార్గదర్శకాలతో త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్‌ఎంసీ తెలిపింది. నకిలీ సమాచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.