Skip to main content

Servers Hacked: ఎయిమ్స్‌ సర్వర్ల హ్యాకింగ్‌ చైనా ముఠాల పనే!

దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) సర్వర్లపై సైబర్‌ దాడికి పాల్పడింది చైనా, హాంకాంగ్‌ ముఠాలేనని అనుమానిస్తున్నట్లు అధికార వర్గాలు డిసెంబ‌ర్ 14న‌ తెలిపాయి.

ఎయిమ్స్‌ సర్వర్లు నవంబర్‌ 23న హ్యాకింగ్‌కు గురికావడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అధికారుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్, స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌(ఐఎఫ్‌ఎస్‌ఓ) విభాగం నవంబర్‌ 25న ‘సైబర్‌ టెర్రరిజం’ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో 40 ఫిజికల్, 100 వర్చువల్‌ సర్వర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని సర్వర్లలో వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయి. వీటిలోని డేటాను సురక్షితంగా పునరుద్ధరించారు. చైనా, హాంకాంగ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచే సర్వర్లను హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. చైనా సైబర్‌ నేరగాళ్ల సమాచారం ఇంటర్‌పోల్‌ ద్వారా సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం

Published date : 15 Dec 2022 05:21PM

Photo Stories