Polytechnic: కాలేజీల్లో ఉద్యోగ విజయోత్సవం

మురళీనగర్‌ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మే 1న ఉద్యోగ విజయోత్సవం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ సి.నాగరాణి ఆదేశించారు.
కాలేజీల్లో ఉద్యోగ విజయోత్సవం

2023లో ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రత్యేకంగా నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో అనూహ్యమైన ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపారు. పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు, క్లస్టర్ల వారీగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ల కారణంగా రాష్ట్రంలో 3,500 మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మే 1న జాబ్‌ అచీవర్స్‌ డే నిర్వహించాలని పాలిటెక్నిక్‌ కాలేజీలకు ఉత్తర్వులు పంపారు.

చదవండి: After 10th class: 10వ తరగతి తర్వాత టాప్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఇవే

ఆరోజు ఉద్యోగాలు పొందిన వారికి ఆయా కంపెనీల నుంచి వచ్చిన నియామక పత్రాలు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కంపెనీల ప్రతినిధులు, పూర్వ విద్యార్థుల సంఘం తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించారు. విద్యార్థులందరూ కాలేజీ యూనిఫాంలతో (ఏకరూప దుస్తులు) హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

చదవండి: Polycet: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఇలా చేస్తే ఫ్రీగా పాలీసెట్‌ కోచింగ్.. పూర్తి వివ‌రాలు ఇవే

#Tags