YS Jagan Mohan Reddy: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి.. ఈ లేఖను వెనక్కు తీసుకోండి

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైఎస్సార్‌సీపీ అధ్య క్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండి పడ్డారు.

పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని చంద్రబాబును నిలదీశారు. ‘ఇకనైనా కళ్లు తెరవండి..  వెంటనే ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోండి.

చదవండి: Teaching Staff Jobs: బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. అర్హతలు ఇవే..

ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు. మెడికల్‌ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ‘మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్లండి.. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం.

అంతేకానీ ఇలా మెడికల్‌ కాలేజీల ప్రైవేటుపరం మాటున స్కామ్‌లు చేయడం మానుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అని చంద్రబాబును హెచ్చరించారు. మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారపడుతూ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. 

#Tags