Free Training: రామగుండంలో ఐటీ, ఏఐ స్కిల్‌ సెంటర్ల ఏర్పాటు

గోదావరిఖని: రామగుండంలో ఐటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వెల్లడించారు.

ఆర్జీ–1 టెక్నికల్‌ సెంటర్‌లో అక్టోబర్ 15న నిర్వహించిన ‘యువతకు ఉపాధి శిక్షణ’లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌తో కలిసి కలెక్టర్‌ మాట్లాడారు. తొలుత ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత ఉపాధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చదవండి: Artificial Intelligence : డిజిటల్‌ యుగంలో అన్ని రంగాలకు విస్తరిస్తున్న కృత్రిమ మేథ.. భవిష్యత్‌లో భారీగా కొలువులు!

ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ లాంటి సంస్థల సహకారంతో యువతకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించేలా యువతకు శిక్షణ అందిస్తామని కలెక్టర్‌ వెల్లడిచంచారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఎన్టీపీసీ, సింగరేణి, మెడికల్‌ కాలేజీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానికులకు ఉపాధి కల్పించేలా చూడాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ కలెక్టర్‌ను కోరారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌, ఏసీపీ రమేశ్‌, సేవా అధ్యక్షురాలు అనిత, పర్సనల్‌ మేనేజర్‌ కిరణ్‌బాబు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక బస్సులో జీఎంఆర్‌ వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణకు యువతను తరలించారు.

#Tags