Pphotography, Short Films: ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిలిమ్స్‌ పోటీలకు ఆహ్వానం

మంచిర్యాలక్రైం: పోలీస్‌ అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21న విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు, ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిలిం పోటీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాసులు అక్టోబర్ 8నఒక ప్రకటనలో తెలిపారు.

21న పోలీస్‌ ఫ్లాగ్‌డే సందర్భంగా పోలీస్‌ శాఖకు రిలేటెడ్‌ అంశాల మీద పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ఆసక్తి కలవారు పోలీసుల త్యాగాలు, విధుల్లో చూపించిన ప్రతిభను తెలిపే విధంగా తీసిన 3 ఫొటోలు, మూడు నిమిషాల షార్ట్‌ ఫిలిమ్స్‌ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం అక్టోబర్ 20లోగా కమిషనరేట్‌ కార్యాలయంలోని నక్సల్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (ఎన్‌ఐబీ) ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.

చదవండి: Course and Jobs : ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ విద్యకు ప్రసిద్ధ విద్యాసంస్థలు.. ఈ కోర్సుల‌తో ఉన్న‌త కొలువులు!

కమిషనరేట్‌ స్థాయిలో ఎంపిక చేయబడిన మూడు షార్ట్‌ ఫిలింలు, ఫొటోలను రాష్ట్రస్థాయి పోటీల ఎంపిక కోసం డీజీపీ కార్యాలయం హైదరాబాద్‌కు పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8712656596, 8712656587 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags