Photography, Short Films: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం
Sakshi Education
మంచిర్యాలక్రైం: పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21న విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు, ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిలిం పోటీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు అక్టోబర్ 8నఒక ప్రకటనలో తెలిపారు.
21న పోలీస్ ఫ్లాగ్‌డే సందర్భంగా పోలీస్ శాఖకు రిలేటెడ్ అంశాల మీద పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ఆసక్తి కలవారు పోలీసుల త్యాగాలు, విధుల్లో చూపించిన ప్రతిభను తెలిపే విధంగా తీసిన 3 ఫొటోలు, మూడు నిమిషాల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం అక్టోబర్ 20లోగా కమిషనరేట్ కార్యాలయంలోని నక్సల్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (ఎన్‌ఐబీ) ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
కమిషనరేట్ స్థాయిలో ఎంపిక చేయబడిన మూడు షార్ట్ ఫిలింలు, ఫొటోలను రాష్ట్రస్థాయి పోటీల ఎంపిక కోసం డీజీపీ కార్యాలయం హైదరాబాద్‌కు పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8712656596, 8712656587 నంబర్లలో సంప్రదించాలన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 17 Oct 2024 03:23PM
Tags
- Pphotography
- Short Films
- Police Martyrs Remembrance Week
- Competitions on Topics Related to Police Department
- Naxal Information Bureau
- Adilabad District News
- Telangana News
- ManchiryalCrime
- PhotographyCompetition
- ShortFilmCompetition
- PoliceMartyrsCommemoration
- YouthContest
- StudentCompetitions
- AspiringPhotographers
- October21Event