BEd and BPEd: సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రీకౌంటింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలోని బీఈడీ 1, బీపెడ్‌ 1, 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రీవాల్యుయేషన్‌ / రీకౌంటింగ్‌ కోసం ఆసక్తి గ ల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ అరుణ జూలై 5న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 11లోపు రీవాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.500 ఫీజు, రీకౌంటింగ్‌కు రూ.300 చెల్లించాలని తెలిపా రు. పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

కేజీబీవీలో..

మోపాల్‌: మండల కేంద్రంలోని కేజీబీవీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కోసం అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌వో సుప్రజ జూలై 5న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధా న వంట మనిషి, స్కావెంజర్‌, నైట్‌ వాచ్‌మన్‌తోపాటు స్వీపర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 11లోగా కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

చదవండి: TS Job Aspirants Local Issue: బోనఫైడ్‌లకు బదులుగా పెద్దసంఖ్యలో రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్ల సమర్పణ

8న డిగ్రీ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

నిజామాబాద్‌ అర్బన్‌: మునిపల్లిలో ఉన్న మహాత్మజ్వోతి బాపూలే మహిళ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలకు ఈనెల 8న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కో–ఆర్డినేటర్‌, ప్రిన్సిపాల్‌ సత్యనాధ్‌రెడ్డి జూలై 5న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఏ(ఈపీహెచ్‌), బీకాం(సీఏ), బీకాం(బీఏ), బీఎస్సీ(బీజెడ్‌సీ) ఎన్‌జెడ్‌సీ, ఎంపీపీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, ఎంఎస్‌డీఎస్‌ గ్రూపులలో స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9121167316 నంబరును సంప్రదించాలన్నారు.

ప్రశాంతంగా డిగ్రీ వన్‌టైం చాన్స్‌ పరీక్షలు

డిచ్‌పల్లి: తెయూ పరిధిలోని డిగ్రీ వన్‌టైం చాన్స్‌ బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు జూలై 5న‌ ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపా రు. ఉదయం నిర్వహించిన డిగ్రీ 5, 6వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 156 మందికి 145 మంది హాజరు కాగా 11 మంది విద్యా ర్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 22 మందికి 22 మంది హాజరైనట్లు తెలిపారు. వర్సిటీ పరిధిలో నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌, కామారెడ్డిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలే జ్‌, బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌, ఆర్మూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో డిగ్రీ వన్‌టైం ఛాన్స్‌ పరీక్షలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

#Tags