Pharmaceutical Industry: ‘ఫార్మాకు భారత్‌ కేంద్రంగా నిలుస్తోంది’

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఫార్మారంగ పరిశ్రమకు కేంద్రంగా భారత్‌ నిలుస్తోందని బల్క్‌డ్రగ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీడీఎంఏ) అధ్యక్షుడు ఆర్‌కే.అగ్రవాల్‌ పేర్కొన్నారు.

దేశీయంగా జెనరిక్‌ మందుల తయారీ ద్వారా భారత ఫార్మా రంగ పరిశ్రమ విజయగాథ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం సీఎస్‌ఐఆర్‌ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు వంటివి కీలక భూమిక నిర్వహిస్తాయని చెప్పారు.

చదవండి: Apollo Pharmacy jobs: అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు..

ఈ నేపథ్యంలో ఉత్పత్తిలో పరిమాణం కంటే విలువను (వాల్యూమ్‌ ఓవర్‌ వాల్యూ) పెంచుకునే దిశలో గేర్‌ మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బీడీఎంఏ కూడా నైపుణ్యత, సాంకేతిక, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రెడేషన్, అధునాతన మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటి వాటిలో చొరవ తీసుకుంటుందని చెప్పారు.

సోమవారం సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీలో కెమికల్‌ క్లస్టర్‌ యాక్టివిటీస్‌పై ‘వన్‌ వీక్‌ వన్‌ థీమ్‌’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా.డి.శ్రీనివాసరెడ్డి, డా.శ్రీరామ్, డా.కె.శ్రీనివాసన్, డా.తివారి పాల్గొన్నారు. 

#Tags