IIHT: తెలంగాణలో ఐఐహెచ్‌టీని స్థాపించాలి

సుభాష్‌నగర్‌ : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని తెలంగాణలో స్థాపించాలని ఎంపీ అర్వింద్‌ ధర్మపురితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు రాలు భోగ శ్రావణి కేంద్ర జౌళి, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను కోరారు.

ఈ మేరకు ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో చే నేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇక్క త్‌ డిజైన్లకు ప్రసిద్ధి అని, మార్కెట్‌లో అసలు ఇక్కత్‌ చీరలు రూ.8 వేలు ధర ఉంటుందని భోగ శ్రావణి తెలిపారు. కానీ ప్రింటెడ్‌ ఇక్క త్‌ చీరలు కేవలం రూ.300కే లభించడంతో చేనేత కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభా వం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: NO Admissions in IIHT: ఐఐహెచ్‌టీలో ఈ ఏడాది అడ్మిషన్లు లేనట్లే!.. కార‌ణం ఇదే..

ప్రింటెడ్‌ చీరల ఉత్పత్తి, విక్రయాల మీద చ ర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలని విజ్ఞప్తి చేశా రు. అనంతరం ఆమె పోచంపల్లి శాలువాతో మంత్రిని సన్మానించగా, ఆయన శాలువాను ఆసక్తిగా గమనించారు. తెలంగాణ వచ్చిన ప్పుడు పోచంపల్లిని సందర్శిస్తానని, సమ స్యలపై చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
 

#Tags