Medical Exam Time Table: మెడికల్‌కాలేజీలో ‘తొలి’ పరీక్ష.. పరీక్షల టైంటేబుల్ ఇలా..
2023 ఆగస్టులోనే కాలేజీలో మొదటిబ్యాచ్ అడుగుపెట్టింది. ఏడాదిపాటు తరగతులు పూర్తిచేసుకున్న వైద్యవిద్యార్థులకు ఆగస్టు 1 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు కళాశాల సిబ్బంది పక్కాగా ఏర్పా ట్లు చేశారు.
కళాశాల తొలి ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్ట ర్ జేవీడీఎస్ ప్రసాద్ ఇటీవలే సూర్యాపేట కాలేజీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అకాడమిక్ పరీక్షల అధికారి డాక్టర్ దరహాస పరీక్షల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సజావుగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.
100 మంది వైద్యవిద్యార్థులకు..
నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 సీట్లు ఇవ్వగా, మొత్తం వైద్యవిద్యార్థులు భర్తీ అయ్యారు. ఇందులో బాలికలు–57, బాలురు–43మంది ఉన్నారు.
మిగతా జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలతో పోలిస్తే.. ఇక్కడ తరగతులు బాగానే సాగినట్లు తెలుస్తోంది. ఈమేరకు వైద్యవిద్యార్థులు కూడా పరీక్షలకు ప్రిపేరైనట్లు సిబ్బంది తెలిపారు.
పరీక్షల టైంటేబుల్ ఇలా..
ఆగస్టు ఒకటి నుంచి 12వ తేదీ వరకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
- ఆగస్టు 1న బయోకెమిస్ట్రీ పేపర్–1
- ఆగస్టు 3న బయోకెమిస్ట్రీ పేపర్–2
- ఆగస్టు 5న అనాటమీ పేపర్–1
- ఆగస్టు 7న అనాటమీ పేపర్–2
- ఆగస్టు 9న ఫిజియాలజీ పేపర్–1
- ఆగస్టు 12న ఫిజియాలజీ పేపర్–2 పరీక్షలుంటాయి. ఇక ఈఏడాది నీట్ కౌన్సెలింగ్ పూర్తయితే కొత్తగా మరో 100 మంది వైద్యవిద్యార్థులు నిర్మల్ కాలేజీకి రానున్నారు.
Tags
- First Examination in Medical College
- Medical College
- Dr JVDS Prasad
- Dr Srinivas
- Nirmal District News
- Telangana News
- medical exam
- Government Medical College
- Nirmal District
- Manihar college
- Medical exams 2024
- Annual Examinations
- Medical student batch 2023
- College exam setup
- Examination arrangements
- SakshiEducationUpdates