YVU: నైపుణ్యం ఉంటే అపార అవకాశాలు
డిసెంబర్ 4న యోగివేమన విశ్వవిద్యాలయంలో ‘కెరీర్ అభివృద్ధి కోసం ఉపాధి నైపుణ్యాలు’ అనే అంశంపై రెండురోజుల జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గాలు అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగ నైపుణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం జాతీయ విద్యావిధానం–2020ని అమలులోకి తీసుకు వచ్చిందన్నారు.
చదవండి: Knowledge & Skill Hub: నాలెడ్జ్, స్కిల్స్ హబ్‌గా ఏపీ
డిగ్రీ విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ అమలు చేస్తూ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తోందన్నారు. అకడమిక్ మార్కులు ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లగలవని, ఉద్యోగ ఎంపికకు స్కిల్స్ కీలకమన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఉద్యోగ నైపుణ్యాలు కీలకమన్నారు. ముఖ్యవక్తగా విచ్చేసిన ఎస్.ఆర్. క్రియేటివ్ మైండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కె. సునీల్‌రెడ్డి మాట్లాడుతూ కెరీర్ డెవలప్‌మెంట్, ఉపాధి నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ‘మిషన్ 1000’ పోస్టర్లను విడుదల చేశారు.
చదవండి: APSCHE: ఉన్నత విద్యలో నైపుణ్యం, నాణ్యత కీలకం
కార్యక్రమంలో వర్క్‌షాప్ నిర్వాహకులు డాక్టర్ పి. సరిత, డాక్టర్ కె. లలిత, డాక్టర్ వి. లాజరస్, డాక్టర్ కె. రియాజున్నీసాలు వర్క్‌షాప్ ప్రాధాన్యత, స్కిల్స్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఎస్.ఆర్. క్రియేటివ్ మైండ్స్ ప్రతినిధులు హరిణిరెడ్డి, హర్షిని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.