APSCHE: ఉన్నత విద్యలో నైపుణ్యం, నాణ్యత కీలకం
నవంబర్ 30న ఏపీ ఉన్నత విద్యామండలి–జేకేసీ కళాశాల సంయుక్తంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్–2024 అనే అంశంపై జేకేసీ కళాశాలలో ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య రామ్మోహనరావు మాట్లాడుతూ జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించడంలో కళాశాలలకు ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతో ఉపయోగకరమన్నారు.
చదవండి: APSCHE: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
చైన్నెలోని లయోలా కళాశాల ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ ఆర్.రవీంద్రన్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐఎఫ్‌లో మంచి ర్యాంకు సాధించేందుకు కావాల్సిన అంశాలను వివరించారు. ఉన్నత విద్యామండలి అకడమిక్ అధికారి జి.శ్రీరంగం మాధ్యూ మాట్లాడుతూ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విభిన్న అంశాలను వివరించారు.
వర్క్‌షాప్‌లో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ఏలూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్, ఐక్యూఏసీ సమన్వయకర్తలతో పాటు జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నాగేశ్వరరావు, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్‌ఆర్కే ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి.గోపీచంద్, అధ్యాపకులు పాల్గొన్నారు.