Free Training: స్వయం ఉపాధితో ఎదగండి..

భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజ్‌ ఆకాంక్షించారు.

అక్టోబర్ 18న ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు వివిధ స్వయం ఉపాధి పథకాలపై నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐటీడీఏ భవిత సెల్‌ ద్వారా నిర్వహించే వివిధ రకాల వృత్తి శిక్షణ ద్వారా జీవనోపాధి పొందవచ్చని చెప్పారు.

చదవండి: Free Coaching: యువతకు ప‌లు కోర్సులో ఉచిత శిక్షణ

అనంతరం జేడీఎం హరికృష్ణ మాట్లాడుతూ.. టైలరింగ్‌ శిక్షణకు 65 మంది, మష్రూమ్‌ కల్టివేషన్‌ శిక్షణకు 10 మంది దరఖాస్తు చేసుకోగా వారికి రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా వైటీసీలో 30 రోజుల శిక్షణ ఇస్తామన్నారు.

తేనెటీగల పెంపకానికి దరఖాస్తు చేసుకున్న 23 మందికి కొత్తగూడెం కేవీకే ద్వారా భద్రాచలంలో పది రోజులు శిక్షణ ఉంటుందని చెప్పారు. బ్యూటీషియన్‌ శిక్షణకు 16 మంది, ఎలక్ట్రీషియన్‌ శిక్షణకు 9 మంది దరఖాస్తు చేసుకోగా వారికి బూర్గంపాడులోని ఐటీసీలో నెలరోజుల పాటు శిక్షణ అందిస్తామని వివరించారు.కార్యక్రమంలో అనూష, మణికుమారి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

#Tags