DEO Praneetha: భావితర శాస్త్రవేత్తలుగా ఎదగాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నం.2లో అక్టోబర్ 17న సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించారు. డీఈవో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ, ప్రజలకు ఉపయోగపడే అంశాలను తయారు చేయాలని సూచించారు.
చదవండి: DSC 2024: చదివిన బడిలోకే సారుగా ఉద్యోగం: పుర్రె రమేశ్
సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలన్నారు. సైన్స్ సెమినార్‌లో 16, సైన్స్‌డ్రామాలో 7 పాఠశాలలకు సంబంధించి విద్యార్థులు ఆరు థీమ్స్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. అక్టోబర్ 18న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని, అందులో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఇందులో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.