Government Junior College: తిరుమలగిరికి జూనియర్‌ కాలేజ్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరికి నూతనంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరైంది. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యారు. దీనికి సంబంధించిన జీఓ కాపీని విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం హైదరాబాద్‌లో తుంగతుర్తి శాసన సభ్యుడు మందుల సామేల్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్‌ మాట్లాడుతూ తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల కల అని అన్నారు. గతంలో 1990 డిసెంబర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కోసం శంకుస్థాపన జరిగినప్పటికీ కళాశాల ఏర్పాటు కాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంత ప్రజల కలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజం చేసిందన్నారు. జూనియర్‌ కళాశాల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
 

#Tags