KTR: విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం

విద్య, వైద్యరంగాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోం దని, మూడేళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తామని తెలంగాణ మంత్రి KTR అన్నారు.
విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో Chalmeda Janaki Devi పేరుతో రూ.2కోట్లతో నిర్మించిన స్కూల్‌ భవనాన్ని జూన్‌ 10న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి ప్రారంభించారు. KTR మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు.. మన బడి’లో రూ.7,300 కోట్లతో 2,600 స్కూళ్లలో 12 రకాల వసతులు కల్పించి ఇంగ్లిష్‌ మీడియంగా మార్చుతున్నామని వివరించారు. ఇటీ వల అమెరికా వెళ్లినప్పుడు అనేక మంది ప్రవా సులు సొంతూళ్లలో తమ పూర్వీకుల పేరిట స్కూల్‌ భవనాలు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా అనేక కార్పొరేట్‌ సంస్థలు పేద లకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

#Tags