Free Training: ఎలక్ట్రీషియన్‌ కోర్సులో ఉచిత శిక్షణ

తుమ్మపాల: నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 పథకం ద్వారా ఎలక్ట్రీషియన్‌ కోర్సులో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(నాక్‌), రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు నాక్‌ సహాయ సంచాలకుడు రవికుమార్‌ తెలిపారు.
ఎలక్ట్రీషియన్‌ కోర్సులో ఉచిత శిక్షణ

10వ తరగతి పాసై 15 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులను అర్హులుగా పరిగణించి, రెండు నెలల శిక్షణ అందిస్తామన్నారు. జిల్లాలోని మాకవరపాలెం నాక్‌ శిక్షణ కేంద్రంలో స్టేషనరీ కూడా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 60 మందికి మాత్రమే శిక్షణ ఇస్తామన్నారు. ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 7780275922, 9394885164 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.

చదవండి:

ISRO Director Gifts a Student: విద్యార్థుల‌కు ఇస్రో డైరెక్ట‌ర్ అభినంద‌న‌లు

Wrestling Competitions: జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలో ఎంపిక‌

#Tags