Skip to main content

ISRO Director Gifts a Student: విద్యార్థుల‌కు ఇస్రో డైరెక్ట‌ర్ అభినంద‌న‌లు

అత్య‌ధిక మార్కుల‌ను సాధించిన విద్యార్థికి బ‌హుమ‌తి అందించి, ఇత‌ర విద్యార్థుల‌తో పాటు త‌గిన సూచ‌న‌లు, అభినంద‌న‌లు తెలిపారు. ఇందులో భాగంగానే ఆయ‌న పాఠ‌శాల‌కు సంద‌ర్శించి విద్యార్థుల‌తో, ఉపాధ్యాయుల‌తో మాట్లాడారు..
Former Director of  ISRO speaks to students
Former Director of ISRO speaks to students

సాక్షి ఎడ్యుకేష‌న్: కిల్లోగుడ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో టెన్త్‌ కామన్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థికి ఏటా రూ.20 వేల నగదు బహుమతిని అందజేస్తానని ఇస్రో పూర్వ డైరెక్టర్‌, ఎస్‌ఆర్‌ఎం గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (రిసెర్చ్‌) ఆచార్య డి.నారాయణరావు ప్రకటించారు. సోమవారం ఆయన అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పర్యటించారు. దీనిలో భాగంగా కిల్లోగుడ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు.

Wrestling Competitions: జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలో ఎంపిక‌

అత్యధిక మార్కులు సాధించే దిశగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే నగదు బహుమతి పంపిణీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యకు అందిస్తున్న సౌకర్యాలు, వసతులను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు కూడా అన్ని సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్యాబోధన అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లకే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Published date : 26 Sep 2023 02:36PM

Photo Stories