Tribal Students: గిరిజన విద్యార్థులకు మెరుగైన ‘వసతి’
Sakshi Education
తిరుపతి అర్బన్ : గిరిజన వసతి గృహాల్లోని పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి బి.సూర్యనారాయణ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నట్లు తెలిపారు. వసతి గృహాల పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని మొత్తం 6 గిరిజన హాస్టళ్లలో 420 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. వారి బాగోగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Published date : 26 Oct 2023 03:18PM
Tags
- Tribal students
- tribal welfare schools
- Education News
- andhra pradesh news
- Tirupati Urban news
- District Tribal Welfare Officer
- Empowerment initiatives
- Better facilities for children
- Meal services
- Clean environment
- Student welfare monitoring
- Tribal hostels in the district
- 420 students' welfare
- District development
- Sakshi Education Latest News