Degree Admissions: ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

కాగజ్‌నగర్ గ్రామీణం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన గడువును పొడిగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ తూడూరు దత్తాత్రేయ తెలిపారు.

ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

చదవండి: IIITDM Faculty Posts : ట్రిపుల్‌ఐటీడీఎంలో వివిధ విభాగాల్లో ఫాక‌ల్టీ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్సీ) కోర్సులు, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం ఈ వర్సిటీ జులై 27వ తేదీన‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2024-25 ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే.. https://education.sakshi.com/colleges/education-news/ambedkar-open-university-admissions-2024-25-full-details-telugu-160680 
 

#Tags