Consumers Day: విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

నరసరావుపేట: వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎన్‌బీటీ అండ్‌ ఎన్‌వీసీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు డిసెంబ‌ర్ 18న‌ ఉత్సాహ భరితంగా సాగాయి.

ఈ పోటీలకు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ‘ఈ–కామర్స్‌, డిజిటల్‌ వర్తక శకంలో వినియోగదారుకు రక్షణ‘ అనే అంశంపై తెలుగు, ఆంగ్లంలో వ్యాసరచన, వక్తృత్వపై నిర్వహించిన పోటీలను. జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్‌.పద్మశ్రీ పర్యవేక్షించారు.

ఈ పోటీలలో తెలుగు వ్యాస రచనలో నరసరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పి.స్వాతి, ప్రథమ బహుమతి, మాచర్ల కళాశాలకు చెందిన డి.శ్రీహర్షిత, యు.భవాని ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ఆంగ్ల వ్యాసరచనలో వినుకొండ ప్రబుత్వ డిగ్రీ కాలేజికి చెందిన పి.శ్యాంప్రసాద్‌, ఎం.షాలెంరాజు ప్రథమ, ద్వితీయ బహుమతులు, నరసరావుపేట కళాశాలకు చెందిన ఏ సౌజన్య తృతీయ బహుమతి దక్కించుకున్నారు.

చదవండి: Covid New Variant: కొత్త వేరియంట్‌తో మ‍ళ్ళీ మొదలైన కోవిడ్‌..! ఇవే దాని లక్షణాలు

తెలుగు వక్తృత్వ పోటీలో మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డి. శ్రీహర్షిత ప్రథమ బహుమతి సాధించగా, నరసరావుపేట, వినుకొండలకు చెందిన కళాశాలల విద్యార్ధులు పి.స్వాతి, ఎం.షాలెంరాజు ద్వితీయ, తృతీయ బహుమతులు గెల్చుకున్నారు. ఇంగ్లిష్‌ విభాగంలో వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎం.షాలెంరాజు ప్రథమ బహుమతి.

నరసరావుపేట కళాశాలకు చెందిన పి.స్వాతి, ద్వితీయ బహుమతి సాధించారు. విజేతలందరికీ డిసెంబ‌ర్ 22న కలెక్టర్‌ ఆఫీసులో నిర్వహించనున్న వినియోగదారుల దినం సందర్భంగా నిర్వహించనున్న సమావేశంలో కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రథమ బహుమతికి రూ.1500, ద్వితీయ బహుమతికి రూ.1000, తృతీయ బహుమతికి రూ.750, జ్ఞాపిక, సర్టిఫికెట్‌ అందజేయనున్నట్లు నరసరావుపేట కళాశాల ప్రిన్సిపాల్‌ కాకాని సుధాకర్‌ తెలిపారు.

ఈసందర్భంగా వినియోగదారులకు చెందిన పోస్టర్లు ఆవిష్కరించారు. వినుకొండ కళాశాలకు చెందిన ఆంగ్ల అధ్యాపకులు ఎస్‌.శ్రీనివాసరావు, మాచర్ల కళాశాల జువాలజీ అధ్యాపకులు జి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

#Tags