Education: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి

ఆదిలాబాద్‌ టౌన్‌: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీలో న‌వంబ‌ర్‌ 10న టీయూటీఎఫ్‌ రాష్ట్ర 6వ మహాసభలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దుకు కృషి చేస్తామన్నారు.

జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌లో వారి సమస్యలపై ప్రస్తావిస్తామని తెలిపారు. సమాజంలో టీచర్ల పాత్ర కీలకమని, విద్యను నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధికి ఆటంకం ఎదురవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయించింది రూ.21 వేల కోట్ల అని, ఇందులో ఇప్పటివరకు రూ.380 కోట్లు మా త్రమే ఖర్చు చేసిందన్నారు. కమీషన్లు వచ్చే వివిధ సర్వేలకు ప్రైవేట్‌ వ్యక్తులను కేటాయించిన సర్కా రు, ఎలాంటి లాభాలు లేని వాటికి టీచర్లతో సర్వే చేయిస్తుందన్నారు. గత సీఎం కేసీఆర్‌ విద్యారంగంపై ఒక్కరోజు సమీక్ష నిర్వహించలేదని తెలిపారు.

చదవండి: Justice Anil Kumar Jukanti: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ల చ్చిరాం, రఘునందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు ఉన్న ఐదు డీఏ లకు గాను ఒక డీఏను మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పీఆర్సీ రిపోర్టును వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే క్లియరెన్స్‌ చేయాలన్నారు. సర్వీస్‌ రూల్స్‌ సమస్య పరిష్కరించి ఎంఈవో, డైట్‌ లెక్చరర్‌, డిప్యూటీ డీ ఈవో, జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు.
ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎ న్నికల్లో ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. డీఈవో ప్రణీత, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌, మొగలయ్య, బేర దేవన్న, మురళిమనోహర్‌ రెడ్డి, సుజాత, కై లాసం, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్‌, జలంధర్‌రెడ్డి, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

 

#Tags