MLC Kodandaram: విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి

నెన్నెల: సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలకమైనవని, ఈ రెండు రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు.

న‌వంబ‌ర్‌ 19న ఆయన స్వగ్రామం జోగాపూర్‌లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వచ్చిన కోదండరాంతోపాటు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటు అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు.

చదవండి: Free Training: రామగుండంలో ఐటీ, ఏఐ స్కిల్‌ సెంటర్ల ఏర్పాటు

అనంతరం మైలారం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్వాగత సమావేశానికి హాజరయ్యారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన బాలబాలికలకు ప్రతీ దసరాకు నగదు బహుమతి ఇస్తామని చెప్పా రు.

పాఠశాలల పెండింగ్‌ బిల్లుల మంజూరుకు, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గట్టు మల్లేశ్‌, హరీశ్‌గౌడ్‌, దండనాయకుల ప్రకాశ్‌రావు, మల్లాగౌడ్‌, చెన్నోజి శంకరయ్య, రణవీర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags