EF EPI 2024: ఇంగ్లిష్‌ ప్రావీణ్యం అంతంతే.. అత్యద్భుతమైన ప్రావీణ్యం ఉన్న టాప్‌ 9 దేశాలు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా యువ­తలో ఆంగ్ల భాషా ప్రావీ­ణ్యం రాను­రా­ను తగ్గుతోంది. గతేడాది­తో పోలి­స్తే ఈ ఏడాది.. ఆసియా వాసు­ల ఆంగ్ల భాషా ప్రావీణ్యం దారుణంగా పడిపోయింది.

ప్రభు­త్వ రంగంలో పనిచే­సే­వారితో పోలి­స్తే ప్రైవేటు రంగంలోని వారి భాషా నైపు­ణ్యాలు బాగు­న్నాయి. ఇఎఫ్‌ ఆంగ్ల భాషా ప్రావీణ్య సూచి (ఇఎఫ్‌ ఇపిఐ) 2024 నివేది­కలో వెల్లడైన విష­యాలివి. ఇఎఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫస్ట్‌.. విద్యా రంగా­నికి సంబంధించిన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లో ఉంది.

చదవండి: T-SATలో వ్యవసాయ ప్రసారాలు

ప్రజల ఆంగ్ల భాషా ప్రావీ­ణ్యాన్ని అంచనా వేసేందుకు ఏటా ఈఎఫ్‌ టెస్ట్‌ నిర్వహించి.. ఏటా ఇఎఫ్‌ ఇపిఐ విడు­దల చేస్తుంటుంది. అలా గతేడాది నిర్వ­హి­ంచిన ఆన్‌­లైన్‌ పరీక్షలో ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లోని 21 లక్షల మంది పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఇందులో పాల్గొ­న్న­వారి సగటు వయసు 26 ఏళ్లు. వారి వారి సామ­ర్థ్యాలను బట్టి ఆయా దేశా­లను­.. అత్య­ద్భు­తం, అద్భుతం, ఫర్వా­లేదు, తక్కువ, చా­లా త­క్కు­వ విభాగాలుగా విభజించింది. ఇందులో మ­న­­దేశం తక్కువ ప్రావీ­ణ్యం ఉన్న దేశా­ల జాబి­తాలో ఉంది. మన ర్యాంకు 69. 

#Tags