NMC: విద్యార్థులకు డీఆర్‌పీ తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ వైద్య విద్యార్థులు జిల్లాల్లో మూడు నెలల జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం (డీఆర్‌పీ) కింద పనిచేయాలని National Medical Commission (NMC) ఆదేశించింది.
విద్యార్థులకు డీఆర్‌పీ తప్పనిసరి

2020 నుంచే దీన్ని అమలు చేయాల్సి ఉండగా, అప్పట్లో కరోనా కారణంగా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పటినుంచి జిల్లా ఆసుపత్రుల్లో జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. పీజీ వైద్య విద్యలో మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్‌ సమయంలో ఈ డీఆర్‌పీలో విద్యార్థులు పాల్గొనాలి.

చదవండి: KNRUHS: ఎంబీబీఎస్‌లోనే మూడుసార్లు ‘నెక్ట్స్‌’

మూడు నెలల పాటు పనిచేయడం తప్పనిసరి. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ 3వ లేదా 4వ లేదా 5వ సెమిస్టర్‌లో విద్యార్థుల భ్రమణాన్ని నిర్వహించాలి. 2021 బ్యాచ్‌లో ప్రవేశించిన విద్యార్థులందరికీ డీఆర్‌పీ తప్పనిసరి. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా డీఆర్‌పీని తప్పనిసరి చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో లేదా 100 పడకల ఆసుపత్రిలో డీఆర్‌పీ అమలు చేయాలి. 

చదవండి: NMC: అనుమతి లేని కాలేజీల్లో చేరొద్దు

#Tags