PJTSAU: వ్యవసాయ వర్సిటీ వజ్రోత్సవాలకు రండి.. యూజీసీ చైర్మన్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆల్దాసు జానయ్య.. నవంబర్ 20న యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ డాక్టర్ మామిడాల జగదీశ్వర్‌ను కలిశారు.
మర్యాదపూర్వకంగా జరిగిన వీరి భేటీలో జాతీయ విద్యా విధానం ప్రాధాన్యం, ఆవశ్యకతలపై చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానంపై పలు సందేహాలను జగదీశ్వర్ నివృత్తి చేశారు.
భవిష్యత్తు అవసరాల కనుగుణంగా వ్యవసాయ విద్యాలయం నిర్మాణంపై పలు సూచనలు చేశారు. వచ్చేనెల 20వ తేదీన జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు హాజరు కావాలని ప్రొఫెసర్ జానయ్య ఆహ్వానించగా.. డాక్టర్ జగదీశ్వర్ సానుకూలంగా స్పందించారు.
చదవండి: UGC Chairman: 'అలాంటి వాళ్లు పీహెచ్‌డీ చేయకండి'.. యూజీసీ ఛైర్మన్ జగదీశ్‌కుమార్
వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో నూతనంగా నిర్మించతలపెట్టిన బాలికల వసతి గృహ నిర్మాణానికి యూజీసీ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇద్దరి స్వస్థలం నల్లగొండ జిల్లా మామిడాల కావడంతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags