Degree Semester Results Out: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో గత నవంబరులో నిర్వహించిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లోకేష్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ చేతుల మీదుగా కళాశాలలో విడుదల చేశారు.
మూడో సెమిస్టర్ ఫలితాల్లో బీఏలో 71 శాతం, బీకాంలో 62 శాతం, బీఎస్సీలో 68 శాతం, బీబీఏలో 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఐదో సెమిస్టర్‌లో బీఏలో 88 శాతం, బీకాంలో 81 శాతం, బీఎస్సీలో 80 శాతం, బీబీఏలో 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రామకృష్ణ, పరీక్షల విభాగం అధికారులు చలపతి, శ్రీనివాసులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
AP 10th Class Model Papers 2025 : ఏపీ పదో తరగతి మోడల్‌పేపర్స్ విడుదల చేసిన ప్రభుత్వం.. ఒక్క క్లిక్‌తో..
#Tags