BRAOU: డిగ్రీ ఐదో సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఐదో సెమిస్టర్‌ పరీక్షలు జ‌నవ‌రి 22న‌ నుంచి జరగనున్నాయి.

ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వర్సిటీ పరిధిలో 101 డిగ్రీ కళాశాలలు ఉండగా, 61 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య పరీక్షలు జరగనున్నాయి.

చదవండి: Degree Eligible For Jobs 2024 : డిగ్రీతోనే ఉద్యోగం.. తొలిసారిగా 18000 మందికి..

పరీక్ష నిర్వహణ సామగ్రిని పరీక్ష కేంద్రాలకు చేర్చారు. ఈ పరీక్షలకు రెగ్యులర్‌, బ్యాక్‌ లాగ్‌ సబ్జెక్టులు ఉన్న 14,950 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ చెప్పారు. పరీక్షలు సోమవారం నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు.

#Tags