ఐటీ, సైబర్‌ సెక్యూరిటీలపై యువతకు సీటీఈ శిక్షణ

సాక్షి, అమరావతి: ఏపీలో ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇచ్చేలా కన్సార్టియం ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (సీటీఈ) ముందుకువచ్చింది.
ఐటీ, సైబర్‌ సెక్యూరిటీలపై యువతకు సీటీఈ శిక్షణ

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లను ఏర్పాటు చేయడం ద్వారా ఐటీ, సైబర్‌ సెక్యూరిటీల్లో పరిశ్రమలకు అవసరమైన కోర్సులను రూపకల్పన చేసి శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో వినోద్‌ కుమార్, సీటీఈ డైరెక్టర్‌ అళగర్సామిలు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.  

చదవండి:

UPSC Civils Free Coaching: సివిల్‌ సర్వీస్‌ లాంగ్‌ టర్మ్‌ ఉచిత శిక్షణ... దరఖాస్తుకు చివరి తేదీ ఇదే !

Indian Institute of Technology: జేఈఈ రాకున్నా... ఐఐటీ చదువు

#Tags